Skip to main content

తెలంగాణ Private Engineering Collegesల్లో B-Category ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల!

సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో B-కేటగిరీ సీట్ల కోసం ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ ప్రక్రియ జూలై 19, 2025 నుండి ప్రారంభమవుతుంది, ఆగస్టు 10, 2025 నాటికి పూర్తవుతుంది.
telangana b category engineering admissions schedule released  TGCHE B-category admission notification 2025  Telangana private engineering college admissions start July 19  TGCHE announces B-category seat admissions for 2025 academic year

B-కేటగిరీ మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, సీట్ల కేటాయింపు ప్రక్రియ తదితర వివరాలను TGCH అధికారిక వెబ్‌సైట్ www.tgche.ac.in లో అందుబాటులో ఉంచారు.

ఈ షెడ్యూల్‌ను జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌లైన JoSAA, CSAB, రాష్ట్ర స్థాయి TGEAPCET-2025 షెడ్యూల్స్‌ను అనుసరిస్తూ రూపొందించారు. విద్యార్థులకు సజావుగా, సకాలంలో అడ్మిషన్ల అవకాశాన్ని కల్పించడమే దీని లక్ష్యం.

చదవండి: College Predictor 2025 (AP &TG EAPCET, ICET... )

ముఖ్యమైన తేదీలు:

  • B-కేటగిరీ అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రారంభం: 19 జూలై 2025
  • B-కేటగిరీ అడ్మిషన్ ముగింపు తేదీ: 10 ఆగస్టు 2025

ఇతర కౌన్సెలింగ్ తేదీలు:

TGEAPCET 2025 మొదటి విడత సీట్ల కేటాయింపు: 18 జూలై 2025

TGEAPCET 2025 చివరి విడత కేటాయింపు: 10 ఆగస్టు 2025 లోపు

JoSAA-2025 రౌండ్ 6 కేటాయింపు తేదీ: 16 జూలై 2025

CSAB-2025 మొదటి రౌండ్ ఫలితం: 9 ఆగస్టు 2025

తాత్కాలికంగా తరగతుల ప్రారంభం: 14 ఆగస్టు 2025 తర్వాత

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

గత 6 సంవత్సరాల B-కేటగిరీ అడ్మిషన్ షెడ్యూల్ విశ్లేషణ:

సంవత్సరం TGEAPCET ఫేస్-I ఫేస్-II B-కేటగిరీ మార్గదర్శకాలు అడ్మిషన్ ముగింపు
2025 18.07.2025 30.07.2025 16.07.2025 14.08.2025
2024 12.07.2024 24.07.2024 31.07.2024 29.08.2024
2023 12.07.2023 28.07.2023 18.07.2023 31.08.2023
2022 06.09.2022 04.10.2022 03.09.2022 25.10.2022
2021 15.09.2021 18.09.2021 15.09.2021 15.10.2021
2020 22.10.2020 02.11.2020 14.10.2020 05.11.2020
Published date : 18 Jul 2025 10:59AM

Photo Stories