టీఎస్ ఎంసెట్-2019 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం తెలంగాణ ఎంసెట్-2019 కౌన్సెలింగ్ జూన్ 24 నుంచి ప్రారంభమైంది.
జూన్ 24 నుంచి జూలై 1 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో (www.tseamcet.nic.in) రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ చేసుకునేలా ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. అలాగే ఈ జూన్ 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. కాగా, ఫీజులు పెంచాలని ఆరు కాలేజీలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు రావడం, వాటిపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జూన్ 27 నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలంటే కాలేజీల వారీగా ఫీజుల వివరాలను అందుబాటులో ఉంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈలోగా ఫీజుల వ్యవహారంపై స్పష్టత వస్తే జూన్ 27 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. లేదంటే కొంత ఆలస్యం కానుంది.
ఎంచుకున్న సమయంలో వెరిఫికేషన్...
గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్ణీత తేదీల్లో నిర్ణీత ర్యాంకుల వారు, వారికి కేటాయించిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో చేయించుకునే వారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. స్లాట్ బుకింగ్ ద్వారా తమకు సమీపంలో ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఎంచుకొని నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించింది. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు జూన్ 27వ తేదీ నుంచి జూలై 3 వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ప్రతి గంటకు ఒక స్లాట్‌గా విభజించి వెరిఫికేషన్ చేయనున్న నేపథ్యంలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని నిర్ణీత తేదీలో నిర్ణీత సమయంలో తాము ఎంచుకున్న హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రవేశాల క్యాంపు కార్యాలయ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు.
లక్ష మంది హాజరు...
ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం మే నెల 3, 4, 6 తేదీల్లో నిర్వహించిన ఎంసెట్ రాసేందుకు 1,42,216 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. వాటి ఫలితాలను ఎంసెట్ కమిటీ జూన్ 9న విడుదల చేసింది. అందులో 1,08,213 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 74,989 మంది రిజిస్టర్ చేసుకోగా 68,550 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 63,758 మంది అర్హత సాధించారు. ఎంసెట్ అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 24 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది.
ఎంసెట్ ప్రవేశాల షెడ్యూల్ ఇదీ..
24-6-2019 నుంచి 1-7-2019 వరకు: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్, హెల్ప్‌లైన్ సెంటర్ల ఎంపిక
27-6-2019 నుంచి 3-7-2019 వరకు : స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
27-6-2019 నుంచి 4-7-2019 వరకు: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన వారికి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం
4-7-2019 : ముగియనున్న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
6-7-2019: ప్రాథమికంగా సీట్ల కేటాయింపు
6-7-2019 నుంచి 12-7-2019 వరకు : ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్

Published date : 24 Jun 2019 06:01PM