తెలంగాణలో కొలిక్కి వచ్చిన ఎంసెట్ పరీక్ష కేంద్రాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఈనెల 15న నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ఉన్నత విద్యా మండలి, ఎంసెట్ కమిటీ చేపట్టిన కసరత్తు చివరి దశకు చేరుకుంది.
ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వ సిబ్బందితోనే ఎంసెట్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల అధికారులతో సమావేశమై చర్చించారు. కాగా, ఈ నెల 15న మణిపాల్ యూనివర్సిటీ ఆన్‌లైన్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నామని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఇపుడు ఎంసెట్‌ను అదే రోజున నిర్వహించడం వల్ల తాము ఒక్క పరీక్ష మాత్రమే రాయాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. అయితే తాము ఇప్పుడు పరీక్ష తేదీని మార్చే పరిస్థితి లేదని ఉన్నత విద్యా మండలి అధికారులు పేర్కొన్నారు.
Published date : 04 May 2016 02:03PM