తెలంగాణలో 5 నుంచి ఎంసెట్ ఆప్షన్లు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం విద్యార్థులు మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉస్మానియా, కాకతీయ పరిధిలో అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, కాలేజీల వారీగా ఫీజుల వివరాలతో కూడిన జీవో ఆదివారం రాత్రి వరకు కూడా ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి చేరలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం 5వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఎలా ప్రారంభించాలన్న అంశంపై క్యాంపు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సోమవారం మధాహ్నం వరకు కాలేజీల జాబితా, ఫీజుల వివరాలు అందితే.. మంగళవారం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపడతామని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా అ దిశగా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. కాలేజీల వారీగా ఫీజులకు సంబంధించిన ఉత్తర్వుల జారీకి కసరత్తు పూర్తి చేసింది. సోమవారం మధ్యాహ్నంకల్లా ఈ జీవోను జారీ చేసేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోని విద్యార్థులు, అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఉత్తీర్ణులై ర్యాంకులు పొందిన విద్యార్థులు ఈ నెల 5, 6 తేదీల్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు.
వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ వివరాలు :
చివరి విడత ప్రవేశాలు :
వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ వివరాలు :
తేదీలు | వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన ర్యాంకుల వారు |
5-7-2016, 6-7-2016 | 1 నుంచి 45 వేలు |
7-7-2016, 8-7-2016 | 45,001 నుంచి 90 వేలు |
9-7-2016, 10-7-2016 | 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు |
10-7-2016, 11-7-2016 | 1వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్లలో మార్పులకు అవకాశం |
14-7-2016 | సీట్ల కేటాయింపు |
21-7-2016 | ఫీజు చెల్లింపుతోపాటు కాలేజీల్లో రిపోర్టింగ్ |
చివరి విడత ప్రవేశాలు :
24-7-2016, 25-7-2016 | సర్టిఫికెట్ల వెరిఫికేషన్ |
27-7-2016 | సీట్ల కేటాయింపు |
29-7-2016 | తరగతుల ప్రారంభం |
Published date : 04 Jul 2016 04:02PM