తెలంగాణలో 1నుంచి ఎంసెట్-2 దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది.
జూలై 9న నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 7 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.500 ఫీజు చెల్లించి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో (med.tseamcet.in/Content/Home.aspx)సబ్మిట్ చేయాలని సూచించింది.
Published date : 01 Jun 2016 02:42PM