ఫిబ్రవరి20న టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) కమిటీ సమావేశాలు ఫిబ్రవరి 11 (బుధవారం)న నుంచి మొదలు కానున్నాయి.
ఒక్కొక్క సెట్ కమిటీ సమావేశాన్ని ఒక్కో రోజు నిర్వహించేందుకు సెట్స్ కన్వీనర్లు తేదీలు ఖరారు చేశారు. ఆయా సెట్స్‌కు సంబంధిత యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బుధవారం ఐసెట్, ఫిబ్రవరి17న ఎడ్‌సెట్, ఫిబ్రవరి19వ తేదీన పీఈ సెట్ సమావేశాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నాయి. ఇక ఎక్కువ మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఎంసెట్ కమిటీ సమావేశాన్ని ఫిబవరి15న లేదా 18వ తేదీన నిర్వహించే అవకాశముంది. అదే రోజు ఈసెట్ కమిటీ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వాత లాసెట్ కమిటీ సమావేశం నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ సమావేశాల్లో ఆయా సెట్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ల జారీ తేదీలు, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించనున్నారు. వాటితోపాటు అర్హతలు, ఇతర నిబంధనలను కూడా ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు. ఇక ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 20 లేదా 21వ తేదీన జారీ చేసే అవకాశం ఉంది.
Published date : 12 Feb 2020 04:04PM