ప్రశాంతంగా అగ్రికల్చర్ ఎంసెట్ 2020
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 21 జోన్లలో సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు పూటల్లో సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో జరిగిన ఈ పరీక్షలకు 81.55 శాతం హాజరు నమోదైంది. ఈ పరీక్షలకు మొత్తం 39,472 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 32,191 (85.58%) మంది హాజరయ్యారు. తెలంగాణ నుంచి 30,833 మందికి గాను 26,389 మంది, ఏపీ నుంచి 8,639 మందికిగాను 5,802 (67.16%) మంది పరీక్ష రాశారు. అలాగే, నాలుగైదు రోజుల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నా యి. ఈ మేరకు యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. ఈ ఫలితాలు వచ్చిన 4 రోజుల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ ఫలితాలు విడుదల చేసే అవకాశముంది.
Published date : 29 Sep 2020 01:05PM