Skip to main content

మే 5న ఏపీ ఎంసెట్

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎంసెట్-2016) వచ్చే ఏడాది మే 5న నిర్వహించనున్నారు. ఈసారి కూడా ఎంసెట్ నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూ-కాకినాడకు అప్పగించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే వివిధ సెట్ల తేదీలను, వాటిని నిర్వహించే యూనివర్సిటీల వివరాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రకటించారు. ఆయన సోమవారం సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాదులోనూ పరీక్ష కేంద్రాలు :
ఏపీ ఎంసెట్ పరీక్ష కేంద్రాలను హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి గంటా చెప్పారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఆయా సెట్ల షెడ్యూళ్లను విడుదల చేస్తామన్నారు. ఏపీలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ లేనందున ఈసారి సెట్ల నిర్వహణ కార్యకలాపాలన్నీ హైదరాబాద్ నుంచే కొనసాగించాల్సి వస్తుందన్నారు. అయినా, నాలుగైదు సెట్లను అమరావతి కేంద్రంగా నిర్వహించేందుకు ప్రయత్నించాలనిఅధికారులకు సూచించినట్లు తెలిపారు. అమరావతిలో సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రం శాశ్వత భవనం కోసం మూడెకరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరుతామని పేర్కొన్నారు. ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సీట్లు దక్కిన వారు అక్కడ చేరిపోతుండడంతో రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో సీట్లు మిగిలిపోతున్నాయని, వీటిని భర్తీచేసేందుకు ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉందన్నారు.

కళాశాలలకు గ్రేడింగ్‌లు :
2015లో కళాశాలల్లో బోధన, బోధనేతర సదుపాయాలను పరిశీలించి, అర్హత పొందిన కాలేజీలను మాత్రమే కౌన్సెలింగ్‌కు అనుమతించాలని భావించినా సమయాభావం వల్ల చేయలేకపోయామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఈసారి జేఎన్‌టీయూఏ-కే పరిధిలోని కాలేజీలను పరిశీలించి గ్రేడింగ్‌లు ఇచ్చి, ఆ మేరకు కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు.

వివిధ సెట్లు, అవి జరిగే తేదీల వివరాలివి:

సెట్

యూనివర్సిటీ

తేదీ

ఎంసెట్

జేఎన్‌టీయూ-కే

మే 5

ఈసెట్

జేఎన్‌టీయూ-ఏ

మే 9

పీఈసెట్

ఏఎన్‌యూ

మే 9

ఐసెట్

ఏయూ

మే 16

ఎడ్‌సెట్

ఎస్‌వీయూ

మే 23

పీజీసెట్

జేఎన్‌టీయూ-కే

మే 26

లాసెట్

ఎస్‌కేయూ

మే 28

పీజీలాసెట్

ఎస్‌కేయూ

మే 28

Published date : 22 Dec 2015 12:04PM

Photo Stories