మే 2 నుంచి టీఎస్ ఎంసెట్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలను మే 2 నుంచి 7 వరకు నిర్వహించేందుకు జేఎన్‌టీయూహెచ్ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 2,20,990 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,47,912 మంది, అగ్రికల్చర్ ఎంసెట్ రాసేందుకు 73,078 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
Published date : 01 May 2018 03:51PM