మెడిసిన్‌కే బాలికల మొగ్గు..
Sakshi Education
56 వేలు దాటిన ఎంసెట్ దరఖాస్తులు<br/>
ఆంధ్రప్రదేశ్ నుంచి 7 వేల వరకు దరఖాస్తులు<br/>
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ కోసం శుక్రవారం సాయంత్రం వరకు 56,743 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజనీరింగ్ కోసం 33,360 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 22,677 మంది, రెండింటికి 353 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 28న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజనీరింగ్ కోసం 19,745 మంది బాలురు, 13,615 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 6,821 మంది బాలురు, 15,856 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికి దరఖాస్తు చేసుకున్న వారిలో 151 బాలురు ఉండగా, 202 మంది బాలికలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా ప్రాంతం నుంచి 3,763 మంది, రాయలసీమ ప్రాంతం నుంచి 3,023 మంది, నాన్ లోకల్ కేటగిరీ కింద 2,441 మంది, తెలంగాణ ప్రాంతం నుంచి 47,516 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Published date : 21 Mar 2015 03:02PM