కొత్త పరీక్ష కేంద్రాల కోసం మెయిల్ పంపండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు పరీక్ష కేంద్రాలను ఎంచుకోవాలంటే హెల్ప్‌డెస్క్ (helpdesk.tseamcet2018@jntuh.ac.in) కు మెయిల్ ద్వారా విజ్ఞప్తులు పంపించాలని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు.
విజ్ఞప్తులను దరఖాస్తు చేసుకునేప్పుడు ఇచ్చిన మెయిల్ ఐడీ ద్వారానే పంపించాలని సూచించారు. విద్యార్థులు ఎంచుకున్న పరీక్ష కేంద్రాల సమాచారం విద్యార్థుల మెయిల్‌కు పంపిస్తామని పేర్కొన్నారు. కొత్తగా ఆదిలాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, కోదాడలో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను ఎంసెట్ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వివరించారు.
Published date : 03 Apr 2018 03:55PM