జూన్ 4న ఏపీ ఎంసెట్ ఫలితాలు!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్-2019 ఫలితాలను జూన్ 4న విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.
ఈ ఫలితాలను మే ఒకటి లేదా మూడో తేదీన విడుదల చేయాలని భావించినా తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం వల్ల ఆలస్యమైంది. ఈ ఫలితాల సమాచారం ఎంసెట్ అధికారులకు శుక్రవారం చేరింది. దీని ఆధారంగా ఎంసెట్ ర్యాంకులను రూపొందించే ప్రక్రియకు మూడు రోజుల సమయం పడుతుంది. జూన్ 3న విద్యాశాఖపై సీఎం జగన్ నిర్వహించే సమీక్షలో అధికారులు ఎంసెట్, ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలపై సీఎంకు నివేదించనున్నారు. ఎంసెట్ ఫలితాల విడుదలపై సీఎం సమీక్ష సందర్భంగా వచ్చే సూచనలను అనుసరించి ముందుకు వెళ్లనున్నామని అధికారులు పేర్కొన్నారు. సీఎం చేతుల మీదుగా ఈ ఫలితాల విడుదలకు అవకాశముంటే తేదీ, సమయం, వేదికను ఖరారు చేసి విడుదల చేస్తామన్నారు.
Published date : 03 Jun 2019 04:31PM