ఈనెల 12 నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు.
ర్యాంకుల వారీగా ఏయే తేదీల్లో ఎవరెవరికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందనే వివరాలను తమ వెబ్‌సైట్‌లో (https://tseamcet.nic.in /) అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కాగా ఈ నెల 10వ తేదీ నాటికే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలు, వాటిల్లో సీట్ల వివరాలను ఇస్తామన్న యూనివర్సిటీలు ఇంతవరకు ఉన్నత విద్యామండలికి అందజేయలేదు. అయితే ఈ నెల 16న వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో 14వ తేదీ నాటికి వచ్చే కాలేజీలను ప్రవేశాల కౌన్సెలింగ్‌లో చేర్చేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది.
Published date : 12 Jun 2017 02:19PM