హైదరాబాద్‌లో ఏపీ ఎంసెట్ కేంద్రాలపై తెలంగాణకు లేఖ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఏపీ ఎంసెట్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి ఏపీ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు.
నాలుగు రోజుల క్రితం రాసిన ఈ లేఖ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ పరిశీలనకు వెళ్లింది. సెంటర్ల ఏర్పాటుకు అనుమతించే అంశంపై ఒకటి రెండురోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశముందని ఎంసెట్ కౌన్సెలింగ్ చీఫ్ క్యాంప్ ఆఫీసర్ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) రఘునాథ్ తెలిపారు. అనుమతి వచ్చిన వెంటనే హైదరాబాద్ కేంద్రాల పేర్లను ఎంసెట్-2016 వెబ్‌సైట్లో పొందుపరుస్తామని చెప్పారు. సెంటర్, ఇతర వివరాలను మార్పు చేసుకొనేందుకు అభ్యర్థులకు ఒక రోజు సవరణ అవకాశం ఇవ్వనున్నారు.
Published date : 05 Feb 2016 05:29PM