హైదరాబాద్‌లో ఏపీ ఎంసెట్ కేంద్రాలపై సందిగ్ధత
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఏపీ ఎంసెట్-2016 పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ఏపీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలకు ముందే తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ఉన్నత విద్యా శాఖ లేఖ రాసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏపీలోని కేంద్రాల జాబితాను మాత్రమే ఎంసెట్-2016 వెబ్‌సైట్లోని ఆన్‌లైన్ దరఖాస్తులో పొందుపరిచారు. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడం.. మార్చి 21 వరకు గడువు పెట్టడంతో తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా హైదరాబాద్ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారు ప్రస్తుతం ఏపీలోని పరీక్ష కేంద్రాలకే ఆప్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
గతేడాది ఇదే పరిస్థితి :
గతేడాది కూడా ఇదే రకమైన సందిగ్థత ఏర్పడింది. ఎంసెట్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయగా చివరి నిమిషంలో అనుమతి లభించింది. దీంతో హైదరాబాద్‌లో కేవలం మూడు ప్రాంతాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ కాస్త సమయంలోనే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు మార్చుకోవడానికి అవకాశమివ్వడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల నుంచి దాదాపు 24 వేల మంది ఏపీ ఎంసెట్‌కు హాజరయ్యారు. ఇందులో 8 వేల మంది మెడిసిన్‌కు, 16 వేల మంది ఇంజినీరింగ్ పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్-2016కు కూడా ఇదే సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నత విద్యా శాఖ అధికారులు లేఖ రాశారు. కాగా, గతేడాది ఏపీ ఎంసెట్ కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినా తెలంగాణ ఎంసెట్ కేంద్రాలను మాత్రం ఆ ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు చేయలేదు. దీంతో తెలంగాణలోని ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం ఏపీ విద్యార్థులు హైదరాబాద్‌లోనే పరీక్ష రాయాల్సి వచ్చింది.
అనుమతి వస్తే ఏర్పాటు చేస్తాం:
హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు లేఖ రాసిందని ఏపీ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్.సాయిబాబు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గతేడాది చివరి నిమిషంలో అనుమతి లభించినప్పటికీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించామన్నారు. ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవడానికి 48 రోజుల పాటు గడువిచ్చామని, ఈలోగా తెలంగాణ నుంచి అనుమతి లభిస్తే ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు అక్కడి కేంద్రాల జాబితాను కూడా ఆన్‌లైన్ దరఖాస్తుల్లో చేరుస్తామని వివరించారు.

Published date : 25 Feb 2016 02:06PM