ఏప్రిల్ 28న ఏపీ ఎంసెట్?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో వివిధ ఉన్నత విద్యాకోర్సుల ప్రవేశానికి సంబంధించి నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కసరత్తు చేపట్టింది.
కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, వివిధ రాష్ట్రాల విద్యాశాఖలు, ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్షల తేదీలను అనుసరించి రాష్ట్రంలో వివిధ సెట్ల తేదీలపై ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 28న ఎంసెట్‌ను నిర్వహించే అవకాశముంది. ఆ తదుపరి ఇతర సెట్లపై దృష్టి సారించనున్నారు. మే 10వ తేదీలోగా ఉన్నత విద్యామండలి ద్వారా నిర్వహించే 8 సెట్లను పూర్తిచేయించాలని భావిస్తున్నారు.
గతేడాది తేదీని దృష్టిలో పెట్టుకొనే..
గత ఏడాదిలో ఏపీ ఎంసెట్‌ను మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. అయితే అదే సమయంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి తమ ఎంసెట్ తేదీని మే 2వ తేదీగా ప్రకటించడం.. ఆ తరువాతి తేదీల్లో కర్ణాటక ఎంసెట్ ఉండడంతో ఏపీ ఉన్నత విద్యామండలి తన ఎంసెట్ తేదీని ఏప్రిల్ 29కి మార్పు చేసింది. ఈసారి కూడా ఇదే విధంగా ఏప్రిల్ చివరి వారంలోనే ఎంసెట్‌ను నిర్వహించాలని భావిస్తున్నామని, ఏప్రిల్ 28వ తేదీన ఈ పరీక్ష జరగవచ్చని ఉన్నత విద్యామండలి ముఖ్యుడొకరు సాక్షికి వివరించారు. మెడికల్, డెంటల్ కోర్సుల ప్రవేశానికి జాతీయస్థాయిలో నీట్‌ను తప్పనిసరి చేసినందున ఆరెండు కోర్సులను మినహాయించి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ తదితర కోర్సులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గత ఏడాది ఎంసెట్‌కు 3 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈసారి మెడికల్ విభాగం నీట్ పరిధిలోకి వెళ్తున్నందున కేవలం ఇంజనీరింగ్ తదితర కోర్సులకు మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది కనుక ఆసంఖ్య తగ్గే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రాథమికంగా తేదీలపై ఒక ప్రతిపాదన రూపొందించామని, ఉన్నత విద్యామండలి కమిటీ దీనిపై సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుందని ఆయన పేర్కొన్నారు.
మొత్తం ఆన్‌లైన్ :
ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఈ ఏడాది జరగనున్న ప్రవేశపరీక్షలన్నీ ఆన్‌లైన్లో నిర్వహించ నున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. దీనికి అనుగుణంగా ఆయా బాధ్యతలను కొన్ని యూనివర్సిటీలకు అప్పగించి చైర్మన్, కన్వీనర్లను నియమించింది. ఏపీ ఎంసెట్‌ను గతంలో మాదిరిగానే కాకినాడ జేఎన్‌టీయూకి అప్పగించారు. పీజీసెట్‌ను, ఎడ్‌సెట్‌ను ఆంధ్రా యూనివర్సిటీకి, ఈసెట్‌ను అనంతపురం జేఎన్‌టీయూకి, ఐసెట్‌ను శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి, లాసెట్, పీజీ లాసెట్‌ను శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి, పీఈఈసెట్‌ను నాగార్జున వర్సిటీకి అప్పగించారు. ఈ నెల 16న అన్ని కోర్సుల ప్రవేశపరీక్షల నిర్వహణ కమిటీల సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో అన్ని సెట్లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Published date : 16 Jan 2017 02:07PM