Skip to main content

ఏప్రిల్‌ 26న ‘సాక్షి’ మాక్ ఎంసెట్.. మార్చి 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీల్లోని లక్షలాది మంది ఇంజనీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో మాక్ ఎంసెట్ జరుగనుంది. ఇరు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 26న ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఈ మాక్ ఎంసెట్ జరుగుతుంది.
ఈ పరీక్షకు ప్రశ్నపత్రాలను విశేష అనుభవం కలిగిన నిపుణుల బృందం రూపొందిస్తున్నందున విద్యార్థులు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలవుతుంది. దాంతోపాటు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ప్రతిభ చూపిన మొదటి 10 ర్యాంకర్లకు నగదు బహుమతులు ఉంటాయి. Education Newsఈ మాక్ ఎంసెట్‌కు దరఖాస్తులను మార్చి 12 నుంచి ఎంపిక చేసిన‌ ‘సాక్షి’ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. దరఖాస్తు ఫారం ఖరీదు రూ.75తోపాటు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను వెంట తీసుకుని వస్తే వెంటనే హాల్‌టికెట్ పొందవచ్చు. ఏప్రిల్ 20లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ జూనియర్ కాలేజీల నిర్వాహకులు ఏకమొత్తంగా ఈ మాక్ ఎంసెట్‌కు రిజిస్టర్ చేసుకోవాలంటే.. 96664 21880 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.
 
జిల్లాల వారీగా ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ కేంద్రాలు, ప‌రీక్ష కేంద్రాల వివ‌రాల కోసం క్లిక్ చేయండి.
Published date : 09 Feb 2015 11:25AM

Photo Stories