Skip to main content

ఏపీఎంసెట్-2019 ప్రాథమిక ’కీ’ విడుదల

సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్- 2019 ఆన్‌లైన్ పరీక్షలు ఏప్రిల్ 24తో ముగిశాయి.
ఇంజినీరింగ్‌లో 1,85,711 మంది, అగ్రి, మెడికల్ విభాగంలో 81,916 మంది మొత్తం 2,67,627 మంది పరీక్ష రాశారు. ఐదు రోజుల పాటు జరిగిన ఎంసెట్ పరీక్షలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఏర్పడలేదని ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ రామలింగరాజు, కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబు తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం వరకు ఏడు సెషన్లలో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జరిగిందని, మొత్తం 1,95,908 మంది హాజరుకావాల్సి ఉండగా 1,85,711 మంది పరీక్ష రాసినట్లు వారు పేర్కొన్నారు. 45 మంది ఉర్దూ మీడియం విద్యార్థులు హాజరయ్యారు. ఒక మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది. ఇంజనీరింగ్‌లో సెషన్లవారీ మాస్టర్ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక ’కీ’ ఏప్రిల్ 24 మధ్యాహ్నం ఎంసెట్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఏప్రిల్ 26 వరకు ’ Apeamcet2019 objections@ gmail.com'మెయిల్ అడ్రస్‌కు అభ్యంతరాలు పంపవచ్చు. అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం నుంచి 24వ తేదీ సాయంత్రం వరకు 3 సెషన్లలో జరిగింది. 86,999 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 81,916 మంది పరీక్ష రాశారు. 72 మంది ఉర్దూ మీడియం విద్యార్థులు హాజరయ్యారు. ర్యాంకులను నిర్ధారించేందుకు ఎంసెట్ మార్కులు 75 శాతం, ఇంటర్ మార్కులు 25 శాతం వెయిటేజి మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షకు సంబంధించి సెషన్లవారీ మాస్టర్ పత్రాలు, వాటి ప్రాథమిక కీలను ఏప్రిల్ 25 ఎంసెట్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రంలోగా పంపవచ్చు.

ఏపీ ఎంసెట్-2019 ప్రాథమిక ’కీ’క్లిక్ చేయండి
Published date : 25 Apr 2019 05:02PM

Photo Stories