Skip to main content

ఏపీ సెట్స్‌కు పకడ్బందీగా విద్యాశాఖ ఏర్పాట్లు... సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేయిస్తోంది.

ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. విద్యాశాఖ అధికారులు, ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు, వివిధ సెట్ల కన్వీనర్లతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లపై పలు సూచనలు అందించారు.

ఏపీ ఎంసెట్2020 ఆన్‌లైన్ టెస్ట్స్, ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్ టెస్ట్స్, స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

  1. కోవిడ్-19 ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ ఉన్నత విద్యామండలి ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టింది.
  2. కంప్యూటర్ ఆధారిత (సీబీటీ)గా (పీఈసెట్ మినహా) ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
  3. ఇప్పటికే బార్‌కోడింగ్ హాల్ టికెట్లు జారీచేసి, విద్యార్థులు పాటించాల్సిన విధివిధానాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
  4. పతి అభ్యర్థి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్‌ను తీసుకొనేందుకు ప్రత్యేక ప్రొఫార్మాను ఉన్నత విద్యామండలి రూపొందించింది.
  5. ఈ నెల 10 నుంచి ఐసెట్ పరీక్షలతో సెట్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
  6. బార్‌కోడ్ స్కానింగ్ ద్వారా అభ్యర్థుల సమాచారాన్ని అధికారులు ధ్రువీకరించుకుంటారు. ఇందుకోసం ప్రవేశద్వారం వద్ద బార్‌కోడ్ రీడర్లను ఏర్పాటు చేశారు.
  7. అభ్యర్థులు మాస్క్‌తో రావాలి. పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేస్తారు.
  8. అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం సెషన్‌లో 7.30- 9.00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌లో 1.30- 3.00 వరకు అనుమతిస్తారు. పరీక్ష ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది.
  9. పతి సెషన్‌లో పరీక్ష హాలు లోపల శానిటైజ్ చేస్తారు.
  10. సెట్లకు సంబంధించిన సమాచారం ఆయా సెట్ల అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.
  11. అభ్యర్థులను ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. టెంపరేచర్ ఎక్కువగా ఉన్న వారిని ఐసోలేషన్ గదిలో పరీక్ష రాయిస్తారు.
  12. పతి కేంద్రంలో ఐసోలేషన్ గదులు కేటాయిస్తున్నారు. ఈ గదుల్లో పరీక్షల సిబ్బందికి పీపీఈ కిట్లు అందించనున్నారు.
  13. ఈసెట్‌లో ఈసారి కొత్తగా అగ్రికల్చర్ డిప్లొమో కోర్సుకు ప్రవేశాలు చేపట్టనున్నారు.
  14. ఐసెట్‌లో గతంలో బీఎస్సీ కంప్యూటర్స్, ఐటీ చేసిన వారికి ఎంసీఏలో లేటరల్ ఎంట్రీ ఉండేది. కానీ ఎంసీఏను రెండేళ్లకు కుదించినందున లేటరల్ ఎంట్రీని రద్దుచేసి వారికి కూడా ఫస్టియర్‌లోనే ప్రవేశాలు కల్పించనున్నారు.
  15. పభుత్వం, విద్యాశాఖ మంత్రి సూచనల మేరకు ఉన్నత విద్యామండలి ప్రవేశ పరీక్షలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోందని సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు.

ప్రవేశ పరీక్ష

తేదీ

ఎంసెట్ (ఇంజనీరింగ్)

సెప్టెంబర్ 17-25

ఎంసెట్ (అగ్రి)

సెప్టెంబర్ 17-25

ఈసెట్

సెప్టెంబర్ 14

ఐసెట్

సెప్టెంబర్ 10, 11

పీజీఈసెట్

సెప్టెంబర్ 28-30

ఎడ్‌సెట్

అక్టోబర్- 1

లాసెట్

అక్టోబర్-1

పీఈసెట్

అక్టోబర్ 2-5

Published date : 04 Sep 2020 02:10PM

Photo Stories