ఏపీ ఎంసెట్‌కు ‘ఆధార్’ తప్పనిసరి: సాయిబాబు
Sakshi Education
బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ ఎంసెట్-2016కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఆధార్ నంబర్ నమోదు చేయాలని కన్వీనర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు.
కాకినాడలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 29న జరగనున్న ఎంసెట్‌కు ఇప్పటివరకు 3,949 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. దరఖాస్తు ఫీజును ఎటువంటి ఫైన్ లేకుండా మార్చి 21 వరకు చెల్లించవచ్చన్నారు. ఏప్రిల్ 21 నుంచి 25 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంసెట్ నిర్వహణపై చర్చించేందుకు గురువారం జేఎన్‌టీయూకేలో ప్రాంతీయ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు www.apeamcet.org వెబ్‌సైట్, 0884-2340535, 2356255 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Published date : 10 Feb 2016 12:48PM