ఏపీ ఎంసెట్‌కు 4,196 దరఖాస్తులు
Sakshi Education
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2015కు ఇప్పటివరకు 4,196 ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చాయని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సాయిబాబు తెలి పారు.
కాకినాడలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని తెలిపారు. దరఖాస్తు ఫీజు రూ.250ను అన్ని జాతీయ బ్యాంకుల్లో చెల్లించవచ్చని కన్వీనర్ చెప్పారు. సందేహాల నివృత్తికి ఫోన్ 040-42005000 లేదా saicharan.s@ billdesk.com మెయిల్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కేంద్రీయ విద్యాలయాల్లో పరీక్ష: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌ను హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయాల్లో నిర్వహించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జంటనగరాల్లో మొత్తం 18 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా.. ఇందులో 5 లేదా 6 కేంద్రాల్లో ఏపీ ఎంసెట్ నిర్వహించనున్నట్లు సమాచారం.

Published date : 11 Mar 2015 03:23PM