ఏపీ ఎంసెట్‌కు 12 నుంచి కౌన్సెలింగ్
Sakshi Education
హైదరాబాద్: ఎంసెట్ 2015 ర్యాంకర్లకు వచ్చే నెల 12 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఎంసెట్ చైర్మన్ వీఎస్‌ఎస్ కుమార్, కన్వీనర్ సాయిబాబు తెలిపారు.
ర్యాంకు కార్డుల్ని ఈ నెల 24 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఎంసెట్ ఫలితాల విడుదల అనంతరం వారొక ప్రకటన చేస్తూ కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ విభాగంలో గతేడాది యూనివర్సిటీ కళాశాలల్లో 3,921 మందికి, అనుబంధ కాలేజీల్లో 1,12,811 మందికి ప్రవేశాలు కల్పించారన్నారు. వైద్య విభాగంలో 3,140 సీట్లు ఉన్నాయని, ఇందులో 50 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామన్నారు. మిగతా సీట్లలో 35 శాతం వేరే ప్రవేశ పరీక్షద్వారా ప్రవేశాల్ని చేపడతామన్నారు. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా ముందుగానే కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మే 24 నుంచి 28వ తేదీ వరకు అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంసెట్.ఓఆర్‌జీ’ వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. వీటిపై అభ్యంతరాలుంటే వ్యక్తిగత పరిశీలన కోసం రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.2 వేల రుసుముతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Published date : 22 May 2015 03:58PM