ఏపీ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ జూలై 1 నుంచి 5వ తేదీ వరకు కొనసాగుతుందని కన్వీనర్ జి.ఎస్.పండాదాస్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంతకు ముందు కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు, హాజరై సీట్ల కేటాయింపు కానివారు, సీట్ల కేటాయింపు అయి మార్పు కోరుకొనే వారు, దివ్యాంగులు, ఇతర కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులు ఈ రెండో విడత కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. వారు ఏ హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి అయినా పరిశీలన చేసుకోవచ్చు. ఇంతకుముందు సీట్ల కేటాయింపయిన వారికి కొత్తగా స్లైడింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. దివ్యాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, కేప్, ఆంగ్లో ఇండియన్ తదితర కేటగిరీలకు ఆయా కాలేజీల్లో 6,185 సీట్లు రిజర్వ్ అయ్యాయి. వారి ధృవపత్రాల పరిశీలనకు ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారు అక్కడికి మాత్రమే వచ్చి పరిశీలన చేయించుకోవాలి. రెండో విడత కౌన్సిలింగ్‌కు 47,526 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు https://apeamcet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
షెడ్యూల్ ప్రకారం, ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్లను ధృవీకరించే కేంద్రాలివే..
షెడ్యూల్ ప్రకారం, ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్లను ధృవీకరించే కేంద్రాలివే..
- ఆంధ్ర లయోలా కళాశాల, రమేష్ ఆస్పత్రి సమీపంలో (ఐటీఐ రోడ్డు), విజయవాడ
- ప్రభుత్వ పాలిటెక్నిక్, కంచరపాలెం, విశాఖపట్నం
- ప్రభుత్వ పాలిటెక్నిక్, కేటీ రోడ్డు, తిరుపతి.
Published date : 02 Jul 2018 02:58PM