ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు మాత్రమే విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ... సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు సోమవారం రాత్రి ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
మెడికల్ ఎంట్రన్స్‌కు సంబంధించి నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వం మెడిసిన్ ఫలితాలను నిలిపివేసి కేవలం ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. సోమవారం పొద్దుపోయాక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలలో టాప్ టెన్ ర్యాంకుల్లో బాలుర హవా కొనసాగింది. ఇంజనీరింగ్‌లో మొత్తం 1,89,246 మంది దరఖాస్తు చేయగా అందులో 1,79,465 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 1,31,580 మంది ర్యాంకులు సాధించారు. మొత్తం హాజరైన వారిలో 81.36 శాతం మంది ఇంజనీరింగ్ ప్రవేశాలకు అర్హత పొందగా అందులో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 82.67 శాతం మంది, బాలురు 80.05 శాతం మంది అర్హత సాధించారు.
విశాఖకు టాప్ ర్యాంకు..
ఎంసెట్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంకు విశాఖపట్నం జిల్లాకు చెందిన సత్తి వంశీకృష్ణారెడ్డికి దక్కగా రెండో ర్యాంకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన చప్పిడి లక్ష్మీనారాయణ సాధించాడు. తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఈసారి ట్యాప్ ర్యాంకుల్లో నిలిచారు. రంగారెడ్డిజిల్లాకు చెందిన కొండా విఘ్నేష్‌రెడ్డికి మూడో ర్యాంకు లభించగా ఇదే జిల్లాకు చెందిన దిగుమర్తి చేతన్‌సాయికి ఆరో ర్యాంకు లభించింది. రంగారెడ్డికే చెందిన తాళ్లూరి సాయితేజకు ఏడో ర్యాంకు, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన సింగంశెట్టి సంజీవ్‌కృష్ణ సాయిదినేష్‌కు తొమ్మిదో ర్యాంకు లభించింది. చెన్నైకి చెందిన ఏ.జెడ్.జార్జ్‌కి 8వ ర్యాంకు వచ్చింది.
ఎంసెట్ ర్యాంకు వచ్చినా..
ఇలా ఉండగా కొంతమంది ఎంసెట్ అర్హులను దురదృష్టం వెంటాడింది. ఈ అభ్యర్థులు ఎంసెట్లో ర్యాంకు సాధించినా ఇంటర్‌లో ఫెయిల్ అయ్యారు. ఎంసెట్ అర్హత సాధించిన 10,033 మంది ఇంటర్ ఉత్తీర్ణులు కాలేకపోయారు. ఇక ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఎంసెట్ ఫెయిలైన వారు 27,231 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో . ఈ ప్రవేశ పరీక్షను 160 మార్కులకు నిర్వహించగా 40 మార్కులను కనీస అర్హతగా పరిగణించారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఆయా అభ్యర్థులకు ర్యాంకులను నిర్థారించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేకుండానే ర్యాంకులను ప్రకటించారు.
జూన్ 22న సీట్ల కేటాయింపు
ఇంజనీరింగ్ విభాగంలో సాధ్యమైనంత త్వరగా కౌన్సెలింగ్ పూర్తిచేసి తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేపట్టింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 27న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూన్ 6న, జూన్ 9 నుంచి 18 వరకు ఆన్‌లైన్లో వెబ్‌ఆప్షన్ల నమోదు, జూన్ 22న సీట్ల కేటాయింపు చేయనున్నారు. జూన్ 27వ తేదీనుంచి తరగతులు ప్రారంభించనున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు, కన్వీనర్ సాయిబాబు తెలిపారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలే జీలు, 305 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిలో ప్రభుత్వ పరిధిలో 3,924 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 1,53,150 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
వెబ్‌సైట్లో ఓఎమ్మార్ షీట్లు
ఎంసెట్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ఓఎమ్మార్ షీట్లను ఈనెల 17వ తేదీనుంచి 21వ తేదీవరకు www.apeamcet.org వెబ్‌సైట్లో పొందుపర్చనున్నామని సాయిబాబు తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే పరిశీలించుకోవచ్చని, ఈనెల 25వ తేదీలోగా అభ్యంతరాలు తెలియచేయాలనుకొనే జనరల్ అభ్యర్థులు రూ. 5 వేలు, ఎస్సీఎస్టీ అభ్యర్థులు 2 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
ఎంసెట్ ఇంజనీరింగ్‌లో టాప్ టెన్ ర్యాంకర్లు:
ముఖ్యమైన తేదీలు..
మే 27న అడ్మిషన్లకు నోటిఫికేషన్
జూన్ 6న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జూన్ 9 నుంచి 18 వరకు ఆన్‌లైన్లో వెబ్‌ఆప్షన్ల నమోదు,
జూన్ 22న సీట్ల కేటాయింపు
జూన్ 27వ తేదీనుంచి తరగతుల ప్రారంభం
సీట్లు ఇవి..
ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలే జీలు 17 , సీట్లు 3,924
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 305, సీట్లు 1,53,150

ర్యాంక్ | అభ్యర్థి పేరు/హాల్ టికెట్ | మార్కులు |
1 | సత్తి వంశీకృష్ణారెడ్డి/553430279 | 158 |
2 | చప్పిడి లక్ష్మీనారాయణ/560540071 | 157 |
3 | కొండా విఘ్నేష్ రెడ్డి/575480853 | 157 |
4 | మూల్పూరు ప్రశాంత్ రెడ్డి/562620122 | 156 |
5 | గంటా గౌతమ్/560730506 | 156 |
6 | దిగుమూర్తి చేతన్‌సాయి/575510674 | 155 |
7 | తాళ్లూరి సాయితేజ/575480377 | 154 |
8 | అబ్బే జెడ్ జార్జి/560530260 | 154 |
9 | సింగంశెట్టి సంజీవకృష్ణ సాయి దినేష్/560500383 | 154 |
10 | నంబూరి జైకృష్ణ సాయివినయ్/560470042 | 154 |
ముఖ్యమైన తేదీలు..
మే 27న అడ్మిషన్లకు నోటిఫికేషన్
జూన్ 6న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జూన్ 9 నుంచి 18 వరకు ఆన్‌లైన్లో వెబ్‌ఆప్షన్ల నమోదు,
జూన్ 22న సీట్ల కేటాయింపు
జూన్ 27వ తేదీనుంచి తరగతుల ప్రారంభం
సీట్లు ఇవి..
ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలే జీలు 17 , సీట్లు 3,924
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 305, సీట్లు 1,53,150
Published date : 10 May 2016 01:23PM