ఏపీ ఎంసెట్ (ఏసీ) ఫలితాలు విడుదల
Sakshi Education
కనిగిరి లక్ష్మి సుస్మితకు మొదటి ర్యాంకు
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు వైద్య కళాశాలల్లో బీ-కేటగిరీ సీట్ల కోసం నిర్వహించిన ఎంసెట్(ఏసీ) ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను హెల్త్ యూనివర్సిటీ వెబ్‌సైట్ (ntruhs.ap.nic.in )లో పెట్టినట్లు వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. ఈ పరీక్షను మే 30న నిర్వహించారు. ప్రవేశ పరీక్ష మార్కులతోపాటు ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను విడుదల చేశారు. తొలి ర్యాంకు కనిగిరి లక్ష్మి సుస్మిత(హాల్‌టికెట్ నం:7040726) సాధించగా, ద్వితీయ, తృతీయ స్థానాల్లో కొల్లి సాయికృష్ణ(హాల్‌టికెట్ నం:7201964), సాయిగోపాల్ కూరపాటి(హాల్‌టికెట్ నం:7051108) నిలిచారు. ప్రవేశ పరీక్షలో 2,693 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
For Results Click Here ntruhs.ap.nic.in/MCETResults.html
For Results Click Here ntruhs.ap.nic.in/MCETResults.html
Published date : 11 Jul 2015 02:20PM