ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియంతా ఆన్‌లైన్‌లోనే...
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్, అగ్రి, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ మే 24న వెలువడింది.
తొలిసారిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో ఈసారి సర్టిఫికెట్ల పరిశీలన సహా అడ్మిషన్ల ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే పూర్తిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల అకడమిక్ వ్యవహారాలకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఇతర అంశాలను సైతం ఆన్‌లైన్ ప్రక్రియలోనే పూర్తిచేయనున్నారు. ఈమేరకు అడ్మిషన్ల కమిటీ కన్వీనర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి వరదరాజన్ నోటిఫికేషన్‌లో పలు సూచనలు పొందుపరిచారు. అభ్యర్థులు అందించిన డేటాను సంబంధిత వెబ్ సర్వీసుల ద్వారా పరిశీలన అనంతరం మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియెట్, ఎస్సెస్సీ బోర్డులు, మీసేవ, ఆర్టీజీఎస్, ప్రజాసాధికార సర్వేల నుంచి ఆన్‌లైన్ డేటాను అనుసంధానం చేసుకున్నారు.
అభ్యర్థులకు సూచనలు..
9 ప్రాంతాల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలు:
కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా..
ఆప్షన్ల నమోదు షెడ్యూల్ ఇలా..
(సీట్ల కేటాయింపు జూన్ 5 సాయంత్రం 6 గంటల తర్వాత)
అభ్యర్థులకు సూచనలు..
- ఏపీ ఎంసెట్- 2018లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్లను పొందేందుకు ఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఇందుకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ఆన్‌లైన్‌లో చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ఇందుకు https://apeamcet.nic.in వెబ్‌సైట్‌లో ‘పే ప్రాసెసింగ్ ఫీ’ అనే లింక్‌ను పొందుపరిచారు.
- అభ్యర్థులు తమ ఇళ్ల నుంచి లేదా ఇంటర్నెట్ సెంటర్లు, హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఎక్కడి నుంచైనా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
- ఎన్‌సీసీ, స్పోర్‌ట్స, దివ్యాంగులు తదితర కేటగిరీలకు సంబంధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన, సీట్ల కేటాయింపునకు వేరుగా ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ తెలిపారు.
- కులం, ఆదాయం ధ్రువపత్రాలు సమర్పించని అభ్యర్థులకు వారి మొబైల్ నంబర్లకు ఇప్పటికే ఎస్‌ఎంఎస్‌లు పంపారు. అలాంటి వారు www.apsche.org వెబ్‌సైట్లో ధ్రువపత్రాల సమాచారాన్ని అప్‌లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్ నంబర్, సెక్యూర్ కోడ్ నమోదు చేయడం ద్వారా అభ్యర్థులు తమ మీసేవ కేంద్రాల ద్వారా పొందిన కుల, ఆదాయ సర్టిఫికెట్ల సమాచారాన్ని అప్‌లోడ్ చేయవచ్చు.
9 ప్రాంతాల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలు:
- విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలోని డిస్టెన్‌స ఎడ్యుకేషన్ విభాగం ఎదురుగా
- కాకినాడ జేఎన్‌టీయూ
- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు
- శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి
- జేఎన్‌టీయూ, అనంతపురం
- రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు
- వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజీ, ప్రొద్దుటూరు
- ఆంధ్రా లయోలా డిగ్రీ కాలేజీ, విజయవాడ
- ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, విజయవాడ
కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా..
తేదీ | ర్యాంకులు |
మే 28 | 1 నుంచి చివరి ర్యాంకు వరకు |
మే 29 | 1 నుంచి చివరి ర్యాంకు వరకు |
మే 30 | 1 నుంచి చివరి ర్యాంకు వరకు |
ఆప్షన్ల నమోదు షెడ్యూల్ ఇలా..
మే 30, 31 తేదీల్లో | 1 నుంచి 60 వేల ర్యాంకు వరకు |
జూన్ 1, 2 తేదీల్లో | 60,001 నుంచి చివరి వరకు |
జూన్ 3 | ఆప్షన్ల మార్పునకు అవకాశం |
జూన్ 5 | ఆన్‌లైన్‌లో సీట్ల కేటాయింపు |
Published date : 25 May 2018 03:41PM