Skip to main content

ఏపీ ఎంసెట్-2020 ఫలితాలు విడుదల..సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో ఫలితాలు

సాక్షి, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2020 ఫలితాలను అక్టోబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుద‌ల‌ చేశారు.
ఫలితాల కోసం www.sakshieducation.com  చూడొచ్చు. సెప్టెంబర్ 17, 18, 21, 22, 23 తేదీల్లో ఇంజినీరింగ్, 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలను నిర్వహించారు. అలాగే ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. అలాగే సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ‘కీ’ కూడా విడుదల చేశారు.
 
ఇంజినీరింగ్‌లో టాప్‌ ర్యాంకర్లు వీరే..
ఫస్ట్‌ ర్యాంక్‌ : వావిలపల్లి సాయినాథ్(విశాఖ)
రెండో ర్యాంక్ : కుమార్ సత్యం (హైదరాబాద్)
మూడో ర్యాంక్:  గంగుల భువన్‌రెడ్డి(ప్రొద్దుటూర్)
నాలుగో ర్యాంక్:  లిఖిత్‌ రెడ్డి(హైదరాబాద్)
ఐదో ర్యాంక్‌:  కౌశల్ కుమార్( సికింద్రాబాద్)
ఆరో ర్యాంక్‌ : శ్రీహర్ష (రాజమండ్రి)
ఏడో ర్యాంక్:  సాయితేజ వారణాసి ( హైదరాబాద్)
ఎనిమిదో ర్యాంక్ : హార్ధిక్ రాజ్‌పాల్( హైదరాబాద్)
తొమ్మిదో ర్యాంక్:  కృష్ణసాయి( శ్రీకాకుళం)
పదో ర్యాంక్‌:  జితేంద్ర( విజయనగరం)
అగ్రికల్చర్‌, మెడిసిన్‌లో టాప్‌ ర్యాంకర్లు వీరే..
ఫస్ట్‌ర్యాంక్‌: చైతన్య సింధు(తెనాలి) 
రెండో ర్యాంక్: లక్ష్మి సామయి మారుతి (తాడికొండ)
మూడో ర్యాంక్ : మనోజ్‌ కుమార్ (తిరుపతి)
నాలుగో ర్యాంక్:  దరశి విష్ణుసాయి( నెల్లూరు)
ఐదో ర్యాంక్:  సుభాంగ్ ( హైదరాబాద్)
ఆరో ర్యాంక్:  హవీష్‌రెడ్డి(హైదరాబాద్)
ఏడో ర్యాంక్:  లిఖిత (కడప)
ఎనిమిదో ర్యాంక్:  జడ వెంకటవినయ్(వేంపల్లి)
తొమ్మిదో ర్యాంక్:  నితిన్ వర్మ(కర్నూలు)
పదో ర్యాంక్:  రేవంత్ (గుంటూరు)
Published date : 09 Oct 2020 07:39PM

Photo Stories