ఏపీ ఎంసెట్- 2020 నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీఎంసెట్- 2020 నోటిఫికేషన్ ఫిబ్రవరి 27 (గురువారం)నవెలువడింది.
సెట్ నిర్వహణ వర్సిటీ అయిన కాకినాడ జేఎన్‌టీయూ దీన్ని విడుదల చేసింది. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రి ఇంజనీరింగ్), బీటెక్ (ఫుడ్‌సైన్సు టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బీవీఎస్‌సీ, ఏహెచ్, బీఎఫ్‌ఎస్‌సీ, బీఫార్మసీ, డీఫార్మా కోర్సులలోకి ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈనెల 29వ తేదీనుంచి దరఖాస్తులను సమర్పించవచ్చు. మార్చి 29 చివరి గడువు.
ఎంసెట్ ఆన్‌లైన్ మోడల్ టెస్ట్స్, మెటీరియల్, గెడైన్స్, ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.
ఆలస్య రుసుము రూ.500లతో ఏప్రిల్ 5వరకు, రూ.1000తో ఏప్రిల్ 10వరకు, రూ.5వేలతో ఏప్రిల్ 15వరకు, రూ.10వేలతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 16నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి ప్రతి రోజూ రెండు సెషన్లలో కంప్యూటరాధారితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌కు రూ.500చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రెండింటికీ హాజరుకాగోరే అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎంసెట్‌కు సంబంధించిన ఇతర సమాచారానికి ‘హెచ్‌టీటీపీఎస్://ఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఈఏఎంసీఈటీ’ వెబ్‌సైట్‌ను సందర్శించాలని వర్సిటీ సూచించింది.
ఆయా పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.

స్ట్రీమ్ | పరీక్షతేదీ |
ఇంజనీరింగ్ | ఏప్రిల్ 20-23 |
అగ్రికల్చర్ | ఏప్రిల్ 23, 24 |
రెండుస్ట్రీమ్‌లు | ఏప్రిల్ 22, 23 |
Published date : 28 Feb 2020 04:22PM