ఏపీ ఎంసెట్-2019 షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ఎంసెట్-2019కు ఫిబ్రవరి 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఫిబ్రవరి 8న జరిగిన ఎంసెట్ నిర్వహణ కమిటీ సమావేశంలో షెడ్యూల్ తేదీలను నిర్ణయించారు. ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 27 వరకు ఉందని, ఏప్రిల్ 20 నుంచి పరీక్షలను ఆన్‌లైన్లో నిర్వహించి ఫలితాలను మే 5న ప్రకటించనున్నామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు ఫిబ్రవరి 9న ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంసెట్ షెడ్యూల్ వివరాలివీ..
ఎంసెట్ షెడ్యూల్ వివరాలివీ..
ఎంసెట్-2019 నోటిఫికేషన్ జారీ: | ఫిబ్రవరి 20 |
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: | ఫిబ్రవరి 26 |
ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువు: | మార్చి 27 |
రూ.500 ఆలస్యరుసుముతో గడువు: | ఏప్రిల్ 04 |
రూ.1,000 ఆలస్యరుసుముతో గడువు: | ఏప్రిల్ 09 |
రూ.5,000 ఆలస్యరుసుముతో గడువు: | ఏప్రిల్ 14 |
వెబ్‌సైట్‌నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: | ఏప్రిల్ 16 నుంచి |
రూ.10,000 ఆలస్యరుసుముతో గడువు: | ఏప్రిల్ 19 |
ఇంజనీరింగ్ కేటగిరీ పరీక్షల తేదీలు: | ఏప్రిల్ 20, 21, 22, 23 |
అగ్రికల్చర్ కేటగిరీ పరీక్షల తేదీలు: | ఏప్రిల్ 23, 24 |
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ రెండు కలిపి | ఏప్రిల్ 22, 23 |
పరీక్ష సమయం: | ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు |
ఫలితాల విడుదల: | మే 5, 2019 |
Published date : 12 Feb 2019 03:31PM