Skip to main content

ఎంసెట్‌కు 2.74 లక్షల దరఖాస్తులు

సాక్షి, అమరావతి:/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంసెట్-2018 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆన్‌లైన్ పద్దతిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 22 నుంచి 24 వరకు ఇంజినీరింగ్, 25న అగ్రికల్చర్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటి వరకు మొత్తం 2,74,756 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ఇంజినీరింగ్‌కు 1,98,112, అగ్రి, డెంటల్ తదితర కోర్సులకు 75,550, రెండింటికీ కలిపి 1094 దరఖాస్తులు వచ్చాయని ఎంసెట్ చైర్మన్ ఎస్.రామకృష్ణారావు, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు పేర్కొన్నారు. రూ. 5 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 16వ తేదీ వరకు, రూ. 10 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. హాల్ టిక్కెట్లను ఈనెల 18 నుంచి ఎంసెట్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.
Published date : 14 Apr 2018 05:49PM

Photo Stories