ఎంసెట్‌కు 2.72 లక్షల దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్‌కు 2,72,224 మంది దరఖాస్తు చేశారు.
ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులకు అపరాధ రుసుము లేకుండా తుది గడువు ఈనెల 21 అర్ధరాత్రితో ముగిసింది. ఈసారి ఇంజనీరింగ్‌కు గతంలో కన్నా 4 వేలు అధికంగా 1,93,469 దరఖాస్తులు అందాయి. ఫార్మా, అగ్రికల్చరల్ కోర్సులకు 77,676 మంది దరఖాస్తు చేశారు. రెండింటికీ కలిపి 1,079 మంది దరఖాస్తు చేశారని సెట్ల కౌన్సెలింగ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రఘునాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఈసారి ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 23 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నందున గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ముందు నుంచే మాక్‌టెస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీలన్నిటిలో ఈనెల 27 నుంచి ఏప్రిల్ 3 వరకు మాక్‌టెస్టులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివిన 25 వేల మంది విద్యార్థులు ఈసారి ఎంసెట్‌కు దరఖాస్తు చేశారు. ఇంటర్నెట్ సదుపాయం లేని 600 కాలేజీల్లో సీడీల ద్వారా మాక్‌టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇక ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్లో 24 గంటలూ అందు బాటులో ఉండేలా మాక్‌టెస్టులను పొందుపరిచామని రఘునాథ్ తెలి పారు. ఈ మాక్‌టెస్టులకు విద్యార్థుల నుంచి స్పందన బాగుందని, ఇప్పటి వరకు 29 వేల మంది దీన్ని అనుసరిం చారని చెప్పారు. ఏపీ ఎంసెట్ వెబ్‌సైట్ ను జేఈఈ, నీట్ వెబ్‌సైట్లతో సమానం గా రూపొందించామని, విద్యార్థులకు ఎలాంటి సందేహాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విద్యార్థులకు స్లాట్‌బుకింగ్‌కు సంబం ధించి వారు ఎంచుకున్న ప్రాంతాల్లో తొలుత దరఖాస్తు చేసిన వారికి తొలి ప్రాధాన్యత ప్రాంతాన్ని కేటాయిస్తామని వివరించారు.
యాప్‌ద్వారా మరింత సమాచారం...
ఎంసెట్‌తో సహా వివిధ సెట్ల సమాచారాన్ని అందు బాటులో ఉంచేందుకు ఉన్నత విద్యామండలి ద్వారా ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్‌లో ఆయా సెట్ల షెడ్యూళ్లు, పరీక్షల తేదీలు, ఇతర సమాచారం ఉంటుంది. హాల్‌టికెట్లు, పరీక్ష కేంద్రాల వివరాలు ఇందులో పొందుపరుస్తున్నామన్నారు. హాల్‌టికెట్ల జారీ తరువాత ఆయా అభ్యర్థులు ఈ యాప్ ద్వారా సెంటర్లు ఎక్కడున్నాయో జియోట్యాగింగ్ ద్వారా తెలుసుకొనే అవకాశముంది. అభ్యర్థులు పరీక్షలు రాసిన వెంటనే వారికి వచ్చిన ప్రశ్నపత్రం, వారు ఇచ్చిన సమాధానాలతో కూడిన సమాచారాన్ని వారి ఈమెయిల్ ఐడీలకు పంపించనున్నారు. ఇదే సమాచారాన్ని వెబ్‌సైట్లోనూ పొందు పరుస్తారు. కీ విడుదల అనంతరం అభ్యర్థులకు వచ్చిన ప్రశ్నలు, వారు గుర్తించిన సమాధానం, సరైన సమాధానానికి సంబంధించిన సమా చారం మెయిల్ అడ్రస్‌కు అందిస్తామని రఘునాథ్ చెప్పారు.

Published date : 23 Mar 2017 02:00PM