ఎంసెట్ వెబ్ ఆప్షన్లకు జూలై 23 వరకు గడువు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ తుది విడత వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు జూలై 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని కమిషనర్ నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటివరకు 343 మంది విద్యార్థులు 5,692 ఆప్షన్లు మాత్రమే ఇచ్చారన్నారు. జూలై 23 వరకు గడువు ఉన్నందున విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జూలై 25న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.
Published date : 23 Jul 2018 03:50PM