Skip to main content

ఎంసెట్ తో స‌హా సెట్‌ల‌న్నీ మే నెల‌లోనే : ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి

సాక్షి, అమ‌రావ‌తి: ఇంజ‌నీరింగ్ త‌దిత‌ర ప్రొఫెష‌న‌ల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ స‌హా ఇత‌ర ప్రవేశ ప‌రీక్ష‌లను ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.
ప‌రీక్షల‌కు సంబంధించి రాష్ట్రంలో చేసిన ఏర్పాటులన్ని లాక్‌డౌన్ వ‌ల్ల ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ కార‌ణంగా నిర్ణీత తేదీల్లో ప‌రీక్షల‌ నిర్వహణ సాధ్యం కాక‌పోవ‌వచ్చని ఉన్నత విద్యామండ‌లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఎంసెట్- 2020 ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్‌, స్ట‌డీ మెటీరియ‌ల్‌, గైడెన్స్‌, ఇత‌ర అప్‌డేట్స్ కొర‌కు క్లిక్ చేయండి.

కారణాలివీ...
  • లాక్‌డౌన్ కార‌ణంగా రాష్ట్రంలోని ఆన్‌లైన్ ప‌రీక్ష కేంద్రాల‌న్నీ కొంత‌కాలంగా పూర్తిగా మూత‌ప‌డ్డాయి. వాటిలో ఎన్ని కంప్యూట‌ర్లు ప‌నిచేస్తాయో తిలీని ప‌రిస్థితి.
  • ముఖ్యంగా ప‌వ‌ర్ బ్యాంక్ ఆఫ్ ఉందో లేదో గుర్తించాలి. ఎన్ని ప‌నిచేస్తున్నాయో ప‌రిశీలించాకే ఆయా కేంద్రాల్లో ప‌రీక్షల‌కు హాల్ టికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది.
  • ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను స‌ర్దుబాటు చేసుకోవ‌డానికి కొంత స‌మ‌యం పుడుతుంద‌ని ఉన్న‌త విద్యామండ‌లికి టీసీఎస్ విన్నవించింది.
  • తొలుత మార్చి 29 వ‌ర‌కు ఎంసెట్ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు తుది గ‌డువు విధించ‌గా.. ఏఫ్రిల్ 5 వ‌ర‌కు పొడిగించారు.
  • లాక్‌డౌన్ విధించ‌డంతో ద‌ర‌ఖాస్తు గ‌డువును ఏప్రిల్ 17 వ‌ర‌కు పొడిగించ‌క త‌ప్పలేదు. తొలుత ఈ నెల 20 నుంచి 24 వ‌ర‌కు ఎంసెట్ ప‌రీక్షల‌కు షెడ్యూల్ ఇచ్చారు.
  • ఇప్ప‌టికీ సుమారు 50 వేల మందికి పైగా విద్యార్ధులు ఎంసెట్ కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్సించాల్సి ఉంది.
  • ఈ దృష్ట్యా సెట్ల‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేసి ప‌రిస్ధితుల‌ను బ‌ట్టి మే నెల‌లో కొత్త షెడ్యూల్స్ జారీ చేస్తామ‌ని ఏపీ ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ కె హేమ‌చంద్రారెడ్డి తెలిపారు.
Published date : 09 Apr 2020 06:06PM

Photo Stories