Skip to main content

ఎంసెట్ తొలిరోజు కౌన్సెలింగ్‌కు 3,954 మంది హాజరు

సాక్షి, అమరావతి, ఏయూ క్యాంపస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్-2017 కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 8 ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 35 కేంద్రాల్లో ఎంసెట్‌లో క్వాలిఫై అరుున అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ర్యాంకుల వారీగా చేపట్టారు. ఈనెల 8న ఒకటో ర్యాంకు నుంచి 8 వేల ర్యాంకు వరకూ ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పించగా 3,954 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు సంబంధించి ఆన్‌లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు కూడా సజావుగానే సాగుతోంది. ఈనెల 8 రాత్రి సమయానికి 24,700 పేమెంటు చేశారు. ఏయూ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతున్న విధానాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. 1435వ ర్యాంక్ సాధించిన ఎస్.హర్ష ప్రీతమ్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లు మార్పునకు అవకాశం :
 
అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 17 వరకూ ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతుందని, 11 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లు మార్పు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, 25న సీట్లు కేటారుుస్తారని, ఈ నెల 29 నుంచి కళాశాలలు ప్రారంభమవుతాయని వివరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంసెట్‌కు 1,87,484 మంది విద్యార్థులు హాజరయ్యారని, వీరిలో 1,41,201 మంది అర్హత సాధించినట్లు తెలిపారు.
 విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ కళాశాలల్లో 4,346 సీట్లు, ప్రైవేటు అనుబంధ కళాశాలల్లో 1,61,583 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశాల అనంతరం రెండు, మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలల నాణ్యత ప్రమాణాల పరిశీలన జరిపి నివేదిక ఇచ్చిందని, 40 కళాశాల్లో తగిన బోధన సిబ్బంది, మౌలిక వసతులు లోపం ఉన్నట్లు గుర్తించిందని మంత్రి వెల్లడించారు. నిబంధనలకు 20 శాతం వరకూ సడలింపు ఉంటుందని, దీనిని అతిక్రమించి ఉంటే కళాశాలల అనుమతులను రద్దుచేస్తామని, ఇటువంటి కళాశాలలను కౌన్సెలింగ్‌కు అనుమతించేదిలేదని హెచ్చరించారు. ఇంజినీరింగ్ విద్యలో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాలుగా ప్రవేశాలు లేని కళాశాలలను గుర్తించామని, వీటి అనుమతులు నిలిపివేస్తామని వివరించారు.
 
 మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు :
 విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలల్లో మిగులు సీట్లను మూడో దశ కౌన్సెలింగ్ అనంతరం భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం అనుబంధ, ప్రైవేటు కళాశాలలకు మాత్రమే స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇకపై విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలకు సైతం దీనిని అమలు జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు.
  పేమెంటు సమస్యలపై ఆందోళన వద్దు :
  ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్లో చెల్లించేప్పుడు ఏర్పడుతున్న సమస్యలపై అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి పేర్కొంది. పేమెంటు గేట్వేలో ట్రాన్సాక్షన్ ఫెరుుల్ అరుుతే మూడు పనిదినాల్లో ఆ మొత్తం ఆయా అకౌంట్లలోకి తిరిగి చేరుతుందని చెప్పింది. పేమెంటు పూర్తరుు డబ్బులు కట్ అయ్యాక రిసిప్ట్ రాకపోరుునా నేరుగా హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లి పరిశీలన చేరుుంచుకోవచ్చని వివరించింది. ఒకటికన్నా ఎక్కువసార్లు పేమెంటు జరిగి ఉంటే అదనంగా అరుున మొత్తం తిరిగి ఆయా అకౌంట్లలోకి చేరుతుందని వివరించింది. 
Published date : 09 Jun 2017 02:02PM

Photo Stories