ఎంసెట్ తదితర పరీక్షలకు నిధులు, విధులపై కమిటీ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఎంసెట్ సహ వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి విధులు, నిధుల వినియోగానికి సంబంధించి గతంలో జారీ చేసిన జీవో 11లో సవరణలు చేయడానికి అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.
ప్రవేశ పరీక్షల నిధులు ఎవరు, ఎలా వినియోగించాలి, విధులు ఏవిధంగా కొనసాగించాలో జీవో నంబర్ 11లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ నిధుల వినియోగంపై ఉన్నత విద్యామండలికి, సాంకేతిక విద్యాశాఖకు మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐఏఎస్ అధికారి హర్షవర్థన్, పి.సుబ్రహ్మణ్యం, సుధేశ్ ఆనంద్, టీవీ కృష్ణమూర్తి (మెంబర్ కన్వీనర్), ట్రెజరీల డెరైక్టర్లలతో కూడిన కమిటీని నియమించింది.
ఎయిడెడ్ టీచర్లకు ఎంఈవోల ద్వారా జీతాలు
ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయలకు జీతాల విడుదలను సరళతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డీఈవోలకు ఈ చెల్లింపు అధికారాలు ఉండగా వీటిని ఎంఈవోలకు అప్పగించింది. అలాగే ప్రధానోపాధ్యాయులకు ఉన్న డీడీవో అధికారాలను యదాతథంగా కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్టు యూటీఎఫ్ నేతల బాబురెడ్డి తెలిపారు.

Published date : 04 Jul 2018 03:22PM