ఎంసెట్ మూడో దశ ర్యాంకుల విడుదల
Sakshi Education
కాకినాడ (బాలాజీపేట): ఏపీ ఎంసెట్–2017 మూడో దశ ర్యాంకులు విడుదల చేసిన్నట్లు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు ఈనెల 14న ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ, తెలంగాణ అభ్యర్థులు 3,863 మందికి, అగ్రికల్చర్ విభాగంలో 1,318 మందికి ర్యాంకులు విడుదల చేశామన్నారు. ఇంజనీరింగ్‌లో 185 మంది, అగ్రికల్చర్ విభాగంలో 63 మంది డిక్లరేషన్ ఫాం త్వరగా అందజేస్తే ర్యాంకులు కేటాయిస్తామన్నారు. అభ్యర్థులకు సందేహాలుంటే 0884–2340535 నంబర్‌కు సంప్రదించవచ్చన్నారు.
Published date : 15 Jun 2017 01:40PM