ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష కు 94.61%హాజరు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్‌లో భాగంగా ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఈనెల 24 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఈనెల 26 తో ముగిశాయి.
రాష్ట్రవ్యాప్తంగా 128 కేంద్రాల్లో 3రోజుల పాటు ఆన్‌లైన్లో ఈ ప్రవేశపరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,98,158 మంది విద్యార్థులకుగాను 1,87,484 (94.61%) మంది హాజరయ్యారని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు, ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయి బాబు తెలిపారు. ఈనెల 28న అగ్రి, ఫార్మా తదితర కోర్సులకు సంబంధించి(బైపీసీ స్ట్రీమ్) ఉదయం, మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు 80,735 మంది దరఖాస్తు చేసుకోగా ఏపీ, తెలంగాణల్లో కలిపి 139 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రిలిమనరీ కీ 28న పరీక్ష ముగిసిన అనంతరం ఎపీ ఎంసెట్ వెబ్‌సైట్లో పొందుపరుస్తామన్నారు. మే 1 సాయంత్రం వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు.
Published date : 27 Apr 2017 03:05PM