ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన ఫీజు ఆన్‌లైన్‌లో
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలనకు ప్రొసెసింగ్ ఫీజును అభ్యర్థులు ఆన్‌లైన్లో చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.విజయరాజు పేర్కొన్నారు.
ఈనెల 5న మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ నరసింహారావు, కార్యదర్శి వరదరాజన్‌లతో కలసి ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. జూన్ 8 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవు తుందని, ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీలు రూ.600 చెల్లించాలని పేర్కొ న్నారు. apeamcet.nic.in వెబ్‌సైట్‌లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని సూచించారు. కాగా, హైల్ప్‌లైన్ సెంటర్లలో నగదు తీసుకోరని అందుకు అభ్యర్థులు ముందుగానే ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సంబంధిత రిసీట్‌ను ఆయా కేంద్రాల్లోని అధికారులకు చూపించాలని కోరారు. కాగా, ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాక సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ఆ మొత్తం తిరిగి రెండు రోజుల్లో వారి అకౌంట్‌లో జమ అవుతుందని తెలిపారు.
Published date : 06 Jun 2017 01:50PM