ఎంసెట్ ద్వారానే బీఎస్సీ ఫారెస్ట్రీలో ప్రవేశాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలను ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఫిబ్రవరి 23నజీవో జారీ చేశారు. ఇంటర్మీడియెట్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటర్‌లో ఆ సబ్జెక్టులు లేకపోతే ఎంసెట్‌లో మాత్రం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు రాయాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీలైతే 40 శాతం ఉంటే సరిపోతుందని వెల్లడించారు.
Published date : 24 Feb 2018 03:55PM