Skip to main content

ఎంసెట్ దరఖాస్తులు 2.13 లక్షలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ దరఖాస్తులు 2.13 లక్షలు దాటాయి. ఏప్రిల్ 4 సాయంత్రం వరకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఎంసెట్ రాసేందుకు మొత్తం 2,13,029 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో ఇంజనీరింగ్ కోసం 1,42,544 మంది, అగ్రికల్చర్ కోసం 69,113 మంది, రెండింటి కోసం 1,372 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 4 అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకునే సమయం ఉండటంతో ఈ సంఖ్య మరింతగా పెరగనుంది. అయితే గతేడాదితో పోల్చితే ఈసారి ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య కొంత తగ్గింది. గతేడాది మొత్తం 2,20,248 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,41,187 మంది, అగ్రికల్చర్ కోసం 79,061 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఏప్రిల్ 6 నుంచి సవరణకు అవకాశం :
ఎంసెట్ దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు ఎంసెట్ కమిటీ అవకాశం కల్పించింది. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు పొరపాట్లను సవరించుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి 28 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

హైదరాబాద్ కేంద్రాల్లోనే అత్యధికం :
మొత్తం ఎంసెట్ దరఖాస్తుల్లో సగానికి పైగా విద్యార్థులు హైదరాబాద్‌లోని 5 జోన్ల పరిధిలోనే ఎంసెట్ రాసేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్‌కు వచ్చిన 2,13,029 దరఖాస్తుల్లో 1,34,808 మంది వి ద్యార్థులు హైదరాబాద్‌లోని 5 జోన్ల పరిధిలోనే పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

ఏపీ నుంచి 28,418 దరఖాస్తులు :
తెలంగాణ ఎంసెట్ కోసం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థుల నుంచి 28,418 దరఖాస్తుల వచ్చాయి. అందులో ఇంజనీరింగ్ కోసం 20,619 మంది, అగ్రికల్చర్ కోసం 7,746 మంది, రెండూ రాసేందుకు 53 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల్లో హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక గతేడాదితో పోల్చితే ఏపీ నుంచి తెలంగాణ ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2 వేలకు పైగా పెరిగింది. 2017 ఎంసెట్‌కు ఏపీ నుంచి 26,206 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Published date : 05 Apr 2018 02:53PM

Photo Stories