Skip to main content

ఎంసెట్ దరఖాస్తులో తప్పులు సవరించుకునే అవకాశం

కాకినాడ: ఎంసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష రాసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందులోని తప్పులను సవరించుకునే అవకాశం కల్పించామని ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సాయిబాబు తెలిపారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో తప్పు నమోదైనా, అర్హత పరీక్ష హాల్‌టిక్కెట్ నంబర్ తప్పు దొర్లినా ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్‌టిక్కెట్ సమర్పించి సరిచేసుకోవాలన్నారు. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, రీజనల్, హెల్ప్‌లైన్ సెంటర్ల నమోదులో తప్పుదొర్లితే ఎస్‌ఎస్‌సీ ధ్రువపత్రం సమర్పించాలన్నారు. సంతకం, ఫొటోలు దరఖాస్తులో తప్పుగా నమోదైతే ఎస్‌ఎస్‌సీ ధ్రువపత్రం, ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్‌టిక్కెట్, సంతకం, ఫొటోలను సమర్పించాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులో తప్పుల సవరణకు.. కోరినధ్రువపత్రాలను స్వయంగా కాకినాడలోని ఏపీ ఎంసెట్ కన్వీనర్ కార్యాలయంలో అందజేయవచ్చన్నారు. అలాగే పోస్టల్, ఫ్యాక్స్ మెయిల్ ద్వారా కూడా పంపి సరిచేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.apeamcet.org చూడాలన్నారు.
Published date : 09 Apr 2015 03:12PM

Photo Stories