Skip to main content

ఎంసెట్ దరఖాస్తు గడువు ఈనెల 21 వరకు పెంపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర ఉన్నత సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్-2017కు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 21 వరకు పొడిగించినట్లు సెట్ల కౌన్సెలింగ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రఘునాథ్ పేర్కొన్నారు.
నోటిఫికేషన్ ప్రకారం గడువు ఈనెల 17తో ముగియనుండటంతో మరింత మందికి అవకాశం కల్పించేందుకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2.52 లక్షల ఆన్‌లైన్ దరఖాస్తులు అందాయన్నారు. ఇందులో 1.87 లక్షలు ఇంజనీరింగ్‌కు సంబంధించినవి కాగా తక్కినవి బీఎస్సీ విభాగానికి సంబంధించినవని చెప్పారు.
Published date : 17 Mar 2017 02:24PM

Photo Stories