ఎంసెట్ బైపీసీ విభాగంలో సీట్ల కేటాయింపు పూర్తి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ బైపీసీ విభాగంలో తుది విడత సీట్ల కేటాయింపు శుక్రవారం పూర్తయింది.
ఈ నెల 17, 18 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల నమోదు అనంతరం అడ్మిషన్ల కమిటీ సీట్లు భర్తీ చేసింది. వివరాలను https://apeamcetb.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. తుది విడతలో 8,178 సీట్లకు గాను 7,860 సీట్లు భర్తీ కాగా 318 సీట్లు మిగిలిపోయాయి. ఇవి మొత్తం బీ ఫార్మసీ సీట్లే కావడం గమనార్హం. ఈ కోర్సులో 7,057 సీట్లకు గాను 6,739 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక ఫార్మా-డీ విభాగంలో 1,111, బయోటెక్నాలజీలో 10 సీట్లకు గాను అన్ని భర్తీ అయ్యాయి.
Published date : 20 Aug 2016 02:38PM