ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షకు తొలిరోజు 95.38% హాజరు
Sakshi Education
సాక్షి, అమరావతి/ విశాఖ సిటీ/ కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సులకు తొలిసారిగా ఆన్‌లైన్లో నిర్వహించిన ప్రవేశపరీక్ష (ఏపీ ఎంసెట్-2017)లో తొలిరోజు 95.38 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఆన్‌లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ను మరో రెండు రోజుల పాటు, బైపీసీ స్ట్రీమ్ పరీక్షను ఈనెల 28న జరుపుతారు. రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎంసెట్ 2017కు 2,78,799 మంది దరఖాస్తు చేయగా ఇందులో ఇంజనీరింగ్ విభాగంలో 1,98,064 మంది ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల విభాగంలో 80,735 మంది ఉన్నారు. తొలిరోజు ఉదయం పరీక్షకు 32,336 మంది హాజరు కావాల్సి ఉండగా 30,918 మంది, మధ్యాహ్నం 31,747 మందికి గాను 30,203 మంది హాజరయ్యారని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఏపీలో 124 కేంద్రాలు, హైదరాబాద్‌లో నాలుగు కేంద్రాలలో ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు ప్రారంభమయ్యాయి. బైపీసీ స్ట్రీమ్ కోసం ఏపీలో 133 కేంద్రాలు, హైదరాబాద్‌లో ఆరు కేంద్రాలు ఏర్పాటుచేశారు.
28న కీ విడుదల..: ఎంసెట్ ప్రిలిమినరీ కీని 28న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ చెప్పారు. విద్యార్థులు తమ ప్రశ్నపత్రంలో తాను సమాధానాలు రాసిన ప్రశ్నలను నిర్ధారించిన కీతో సరిపోల్చుకొనేందుకు వీలుగా వారి జవాబు పత్రాలను ఆయా అభ్యర్థుల ఈమెయిల్ అడ్రస్‌లకు పంపించనున్నట్లు చెప్పారు. అలాగే ఈ పత్రాలను ఎంసెట్-2017 వెబ్‌సైట్లో కూడా పొందుపర్చనున్నట్లు వివరించారు. వీటిని డౌన్‌లోడ్ చేసుకొని విద్యార్థులు తమకు ఎన్ని మార్కులు వస్తాయో అంచనాకు వచ్చేందుకు అవకాశముంది. ప్రిలిమినరీ కీలో అభ్యంతరాలు ఉంటే మే 2వ తేదీ సాయంత్రం వరకు అభ్యర్థులు ఎంసెట్ కన్వీనర్‌కు సమర్పించవచ్చు. మే 5వ తేదీన ఈ పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నారు. ర్యాంకులను నిర్ధారించేందుకు ఎంసెట్ మార్కులు 75 శాతం, ఇంటర్మీడియెట్ మార్కులు 25 శాతం వెయిటేజీని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇంటర్మీడియెట్ కాకుండా సీబీఎస్‌ఈ, ఏపీ ఓఎస్‌ఎస్, టీఎస్‌ఓఎస్, ఎన్‌ఐఓఎస్, డిప్లొమో, ఆర్‌జీయూకేటీ, ఇంటర్మీడియెట్ ఒకేషనల్, ఇతర బోర్డుల నుంచి ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇంజనీరింగ్, బైపీసీ విభాగాలకు సంబంధించి డిక్లరేషన్ ఫారాలను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ధ్రువీకరణ పత్రాలు జతపరిచి ఈనెల 30వ తేదీలోగా ఎంసెట్ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా లేదా పోస్టు ద్వారా పంపాలని కన్వీనర్ వివరించారు.
తొలిరోజు ఆటంకాలు...
ఆన్‌లైన్ విధానంలో తొలిసారిగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నందున మొదటి రోజు కొన్ని చోట్ల సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులతో పాటు కొన్ని చోటకంప్యూటర్లు మొరాయించడం వంటి సమస్యలు తలెత్తాయి. విద్యుత్తు కోతలతో కొన్ని కేంద్రాల్లో విద్యార్థులకు అవస్థలు తప్పలేదు. విద్యుత్తు ఆగిపోయిన ప్రాంతాల్లో మళ్లీ వచ్చేందుకు మధ్య వ్యవధి ఎంత ఉందో ఆమేరకు విద్యార్థులకు అదనపు సమయం కేటాయించినట్లు కన్వీనర్ చెప్పారు. ఎంసెట్‌ను పూర్తిగా ఆన్‌లైన్లోనే నిర్వహించడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆయా ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడంలో తడబాటుకు గురయ్యారు. సాంకేతిక సహాయం అందించేందుకు తగినంత మంది సిబ్బంది ఉన్నచోట్ల విద్యార్థులకు సందేహాలు తీర్చగలిగినా... సిబ్బంది తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యార్థులు సమయాన్ని ఎక్కువగా కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని సమస్యలున్నా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించడం ద్వారా పారదర్శకతతో పాటు త్వరితంగా ఫలితాలు ప్రకటించడానికి వీలుంటుందని కన్వీనర్ సాయిబాబు వివరించారు. ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులకు ఈసారి జాతీయస్థాయిలో నీట్ పరీక్ష నిర్వహిస్తుండడంతో ఆ విభాగం అభ్యర్థులు ఈసారి ఎంసెట్‌కు దరఖాస్తు చేయలేదు. అయినా సరే గతంలోని దరఖాస్తుల సంఖ్యకు మించి మరో 20 వేల వరకు అదనంగా ఈసారి రావడంతో పాటు హాజరు శాతం కూడా ఈసారి గతంలో కన్నా పెరగడం విశేషం.
నార్మలైజేషన్ ప్రక్రియలో ర్యాంకులు...
పలుదఫాలుగా ఎంసెట్ నిర్వహిస్తున్నందున వేర్వేరు ప్రశ్నపత్రాలకు సమాధానాలు రాసే విద్యార్థుల సామర్థ్యాన్ని ఒకేతీరును ఎలా అంచనా వేయగలుగుతారన్న అనుమానాలు పలువురు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఆన్‌లైన్ పరీక్షల్లో ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు తావు లేకుండా నార్మలైజేషన్ పద్ధతిలో విద్యార్థులకు ర్యాంకులు ప్రకటిస్తామని ఎంసెట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రశ్నపత్రాలు వేర్వేరుగా వచ్చినా ప్రశ్నలస్థాయి అన్నీ ఒకేరీతిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని, నార్మలైజేషన్లో విద్యార్థులందరి సామర్థ్యాలను ఒకేరకంగా అంచనా వేసి ర్యాంకులు ప్రకటించనున్నామని వివరించారు. జేఈఈ, గేట్ వంటి పరీక్షల్లో కూడా ఈ నార్మలైజేషన్ ప్రక్రియలోనే ర్యాంకులు ప్రకటిస్తున్నారని వారు తెలిపారు.
సెట్‌లన్నీ ఆన్‌లైన్‌లోనే: మంత్రి గంటా
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ కోర్సుల ప్రవేశాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మావన వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా జేఎన్‌టీయూకేలో ఎంసెట్-2017 ఆన్‌లైన్ పరీక్షలకు పాస్‌వర్డ్ విడుదల చేసిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రరాష్ట్రంలో ప్రథమంగా ఎంసెట్ అన్‌లైన్‌లో నిర్వహించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పారు. ఫలితాలను త్వరితంగా విడుదల చేయడంతో పాటు తరగతులను కూడా జూన్19 నుంచి ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.

మాక్ టెస్టులు ఎక్కువ నిర్వహిస్తే బాగుండేది... ఎంసెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించడం కొత్తగా అనిపించింది. ప్రారంభంలో తడబడ్డాను. అయితే పరీక్ష మెరుగ్గా రాయగలిగాను. సాధన ఎక్కువగా ఉంటే ఇంకా వేగంగా రాసిఉండేదా న్ని. ప్రభుత్వం మాక్ టెస్ట్‌లు ఎక్కువగా నిర్వహిస్తే బాగుండేది. - బి.రాజేశ్వరి, ఎంసెట్ అభ్యర్థి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా |
కాలేజీలో నేర్పలేదు.. ఆందోళన పడ్డాను.. ఎంసెట్ పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుందని ఇంటర్ రెండో సంవత్సరం మధ్యలో తెలిసింది. ఆన్‌లైన్ పరీక్ష విధానం ఏమిటో తెలియదు. కళాశాలలో ఏమీ నేర్పలేదు. దీంతో ఆందోళన పడ్డాను. చివరకు వికలాంగ వసతి గృహంలో కో-ఆర్డినేటర్ సహకారంతో ఆన్‌లైన్ పరీక్షపై అవగాహన కలిగించుకున్నాను. ఇంటర్‌లోనే సబ్జెక్టులతో పాటే ఈ విధానంపై అవగాహన కలిగిస్తే బాగుంటుంది. -ఎస్.రాములు, ఎంసెట్ అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ విద్యార్థి, భోగాపురం, విజయనగరం జిల్లా |
Published date : 25 Apr 2017 02:28PM