ఆంధ్రప్రదేశ్‌లో 9న ఎంసెట్ ర్యాంకుల విడుదల
Sakshi Education
బాలాజీచెరువు(కాకినాడ): ఏపీ ఎంసెట్-16 ర్యాంకులను మే 9న జేఎన్‌టీయూకేలో రాష్ట్ర మంత్రులు గంటాశ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావుల సమక్షంలో విడుదల చేయనున్నట్లు కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు.
శనివారం ఎంసెట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రిలిమినరీ కీని శుక్రవారం సాయంత్రం విడుదల చేశామని, దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే మే 4 సాయంత్రం 4 గంటల లోగా తమ వెబ్‌సైట్‌కు తెలియజేయూలన్నారు. ఫైనల్ కీని మే 4న సాయంత్రం 4 గంటల అనంతరం విడుదల చేస్తామని చెప్పారు. అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ మే 27న, సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్ జూన్ 6న, ఆప్షన్ల నమోదు జూన్ 9 నుంచి 18 వరకూ, సీట్ల కేటారుుంపు జూన్ 22న జరుగుతాయని, తరగతులు జూన్ 27 నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏమైనా సందేహాలుంటే 18004256755 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Published date : 02 May 2016 02:27PM