ఆగస్టు 10 నుంచి ఏపీ మెడికల్ కౌన్సెలింగ్
Sakshi Education
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): 2015-16 విద్యాసంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఆగస్టు 10వ తేదీ నుంచి 17 వరకు తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు.
తొలి రోజు 10వ తేదీ ఉదయం వికలాంగ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించిన అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓపెన్ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆగస్టు 13వ తేదీ వరకు ఓపెన్ కేటగిరీ, 14 నుంచి 17 వరకు రిజర్వేషన్ కేటగిరీ (బీసీ/ఎస్‌సీ/ఎస్‌టీ) సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 7, 8 తేదీల్లో స్పెషల్ కేటగిరీ (ఆర్మీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, పోలీసు) కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంతోపాటు హైదరాబాద్ జేఎన్‌టీయూలో కేంద్రం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను జూలై చివరి వారంలో జారీ చేస్తామన్నారు.
Published date : 14 Jul 2015 01:10PM