9లోగా ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 9 లోగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు.
ఈనెల 2 సాయంత్రం 6 గంటల వరకు 70 వేల మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు అగ్రికల్చర్ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షకు ఒకరోజు ముందుగానే విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలని, పరీక్ష సమయానికంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
Published date : 03 May 2017 01:58PM