9 నుంచి ఏపీ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ జూలై 9, 10, 11 తేదీల్లో ఉంటుందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఇక్కడ తెలిపారు.
ఏ కాలేజీలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయో వెబ్‌సైట్లో నమోదు చేయించామని, విద్యార్థులు వాటిని పరిశీలించి ప్రవేశాలకు ముందుకు వెళ్లాలన్నారు. విశాఖలోని ఐఐఎం, తిరుపతిలోని ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, కర్నూలులోని ఐఐఐటీ, తాడేపల్లి గూడెంలోని ఎన్‌ఐటీల్లో ఈ ఏడాది ప్రవేశాలకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సంస్థల్లో విద్యార్థులకోసం తాత్కాలిక వసతుల ఏర్పాటును పూర్తిచేశామని తెలిపారు. నిట్‌లో 240 సీట్లు ఏపీ విద్యార్థులకే వస్తాయని, ఇవిగాక వరంగల్ నిట్‌లో సూపర్ న్యూమరరీ కింద 60 సీట్లు కేటాయించి ఏపీ విద్యార్థులను చేర్చుకోనున్నారని చెప్పారు.
Published date : 29 Jun 2015 03:42PM