Skip to main content

8 నుంచి ‘ఎంసెట్’ ధ్రువపత్రాల పరిశీలన

సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఎంపీసీ విభాగానికి గానూ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు రాష్ట్ర వ్యాప్తంగా 35 కేంద్రాలను ఏర్పాటుచేశారు. దీనికి సంబంధించిన వివరాలు https://apeamcet.nic.in వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అభ్యర్థులు ఏ కేంద్రానికై నా వెళ్లి ధ్రువపత్రాలను పరిశీ లింపచేసుకోవచ్చని కౌన్సెలింగ్ కన్వీనర్ పండాదాస్ పేర్కొన్నారు. దివ్యాంగులు, ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్సు, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం విజయవాడ బెంజ్‌సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేసిన పరిశీలన కేంద్రంలో హాజరుకావాలి. వీరికి 8 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వీరు హాజరు కావాల్సిన తేదీలు వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందు పరిచారు. ఓసీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ కేటగిరీల వారికి ధ్రువ పత్రాల పరిశీలన జూన్ 8 నుంచి 17 వరకు ఉంటుంది.
ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేక కేంద్రాలు...
ఎస్టీ అభ్యర్థుల పరిశీలనకు 13 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీరు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్, విజయనగరం ఎంఆర్‌ఏజీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్, కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్, తణుకు ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్, విజయవాడ ఆంధ్రాలయోలా కాలేజీ, గుంటూరు ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్, ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్, నెల్లూరు ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్, తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్, కడప ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్, అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్, కర్నూలు జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో హాజరుకావాలి.

పరిశీలనకు చూపించాల్సిన ధ్రువపత్రాలు...
  1. ఏపీ ఎంసెట్ ర్యాంకు కార్డు
  2. ఏపీ ఎంసెట్ హాల్‌టిక్కెట్
  3. ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్
  4. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్
  5. ఎస్సెస్సీ తత్సమాన సర్టిఫికెట్
  6. 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ సర్టిఫికెట్, విద్యాసంస్థల్లో చదవని వారు పదేళ్ల రెసిడెన్స్‌ సర్టిఫికెట్
  7. ఆదాయ ధ్రువపత్రం
  8. ఆధార్‌కార్డు
  9. దివ్యాంగ తదితర కేటగిరీల వారు సంబంధిత ధ్రువపత్రాలు
వెబ్ ఆప్షన్ల నమోదు..

తేదీ

ర్యాంకు

జూన్ 11-12 1-30000
జూన్ 13-14 30001-60000
జూన్ 15-16 60001-90000
జూన్ 17-18 90001-120000
జూన్ 19-20 120001-చివరివరకు
జూన్ 21-22 ఆప్షన్ల నమోదులో మార్పులకు అవకాశం
జూన్ 25 వెబ్ ఆధారిత సీట్ల కేటాయింపు

ర్యాంకుల వారీగా ధ్రువపత్రాల పరిశీలన తేదీలు (దివ్యాంగ, ప్రత్యేక కేటగిరీల వారు కాకుండా ఇతరులు) ...

తేదీ

ర్యాంకులు

జూన్ 8 1-8000
జూన్ 9 8001-16000
జూన్ 10 16001-30000
జూన్ 11 30001-45000
జూన్ 12 45001-60000
జూన్ 13 60001-78000
జూన్ 14 78001-95000
జూన్ 15 95001-115000
జూన్ 16 115001-130000
జూన్ 17 130001-చివరి వరకు
Published date : 05 Jun 2017 03:18PM

Photo Stories