6న సప్లిమెంటరీ విద్యార్థుల ఎంసెట్ ర్యాంకులు
Sakshi Education
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఎంసెట్ ర్యాంకులను బుధవారం విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సి.హెచ్ సాయిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ర్యాంకుల సమాచారం విద్యార్థులు రిజిస్టరు చేసుకున్న మొబైల్ నంబరుకు వస్తుందని, ర్యాంకు కార్డులు గురువారం నుంచి ఎంసెట్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర బోర్డుల ద్వారా పరీక్షలు రాసిన విద్యార్థుల ర్యాంకులు కూడా విడుదల చేస్తామని తెలిపారు.
Published date : 06 Jul 2016 02:43PM